ఇంటర్ రెండవ రోజు 5995 మంది విద్యార్థులు హాజరు:: ఇంటర్మీడియట్ బోర్డు నోడల్ అధికారి కల్పన.

అగ్నిధారన్యూస్( పెద్దపెల్లి జిల్లా ) పెద్దపల్లి జిల్లా లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, రెండవ రోజు 5995 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు నోడల్ అధికారి కల్పన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే6,2022 నుండి మే 24,2022 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 28 ఇంటర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మే 7,2022 న జిల్లాలో 6250 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం  పరీక్ష రాయాల్సి ఉండగా, 5995 మంది విద్యార్థులు హాజరయ్యారని, జిల్లాలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని , ప్రశాంతంగా పరీక్ష జరిగిందని,255 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు.