అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కృషివుంటే మనుషులు ఋషులవుతారు అని ఓ సినీ కవి చెప్పిన విషయం నిజమే అనిపించేలా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకి హాజరైన, పెద్దపల్లి గర్ల్స్ కాలేజీ లో హెచ్ఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లక్ష్మీ ని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఆమె సంకల్పబలం ముందు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించింది.
కాళ్లు లేకపోయినా, చేతులు సక్రమంగా పనిచేయకపోయినా. మొక్కవోని మనోధైర్యంతో తన తల్లి సహాయంతో వీల్చైర్ పైన శనివారం రోజు వచ్చి ఇంటర్ ద్వితీయ పరీక్ష కి హాజరైన ఆమెను చూస్తే కాళ్ళు చేతులు ఉండి ఆత్మన్యూనతా భావంతో బాధపడేవారేoదరికో …..ఆమె స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ నోడల్ అధికారి కల్పన మరియు అధ్యాపకులు , లక్ష్మిని ఆమె తల్లిదండ్రులను అభినందించారు….. ముందు ముందు చదువులో మరింతగా రాణించి ఉన్నత శిఖరాలను అవరోహించాలని ఆకాంక్షించారు.

