అగ్నిధారన్యూస్ (నస్పూర్)
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. వరంగల్ నుండి నాగపూర్ కు వడ్ల ధాన్యం లోడ్ తో వెళ్తున్న లారీ హనుమాన్ విగ్రహం మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ కు స్వల్ప గాయాలు కాగా డ్రైవర్ క్షేమంగా ఉన్నాడు.   పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.