*నోబెల్ పాఠశాలకు నేషనల్ ఎడ్యుకేషన్ బ్రిలియంట్ అవార్డు*
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )
పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలలోని నోబెల్ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాతంకంగా అందించే నేషనల్ ఎడ్యుకేషన్ బ్రిలియంట్ అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం డిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎర్రోజు మోహన్ రాజా ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ రాజా మాట్లాడుతూ, పదకొండేళ్ళుగా అతి తక్కువ ఫీజుతో, గ్రామీణ విద్యార్తులకు నాణ్యమైన విధ్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల ఉపాధ్యాయులతో విధ్యార్థుల్లో దాగి ఉన్న మేధస్సును వెలికి తీస్తూ, తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందుతున్నామని వివరించారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం చాలా అనందంగా ఉందని, దీనికి సహకరించిన జిల్లా అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయన కృతఙతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత చేరువగా పేద విద్యార్తులకు విద్యను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
