వివాహ మహోత్సవ ఆహ్వానం పత్రికను విడుదల చేస్తున్న పెంట రాజేష్.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) ఈ నెల 25న జరిగే సామూహిక వివాహాల కార్యక్రమం సంబంధించిన సామూహిక వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం రోజు ఫంక్షన్ లో పెంట రాజేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా 2017 నుండి ఇప్పటివరకు 93 జంటలకు వివాహం చేయడం జరిగిందన్నారు.ఆసరా ఫౌండేషన్ కార్యక్రమాలను విస్తృత పరచడంలో భాగంగా పెద్దపల్లి కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో సామూహిక వివాహ మహోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఇట్టి కార్యక్రమానికి అందరూ…. ఆహ్వానితులే అన్నారు.ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్త సాయి పటెల్,మూల శ్రీధర్,సిద్ది సతీష్ కుమార్ ,మీర్యాల వేంకటేష్,గుర్రం కపీశ్వర్,సాంబ శివరాజు, తదితరులు పాల్గొన్నారు.
