■  సుల్తానాబాద్ మండలంలోని మార్కండేయ కాలనీ లో తనిఖీలు చేసిన పోలీసులు.

■  ప్రజా భద్రత కై పటిష్ట చర్యలు

■  యువత సన్మార్గంలో నడవాలి పిల్లలు మహిళల పట్ల గౌరవంగా ఉండాలి

■  విద్యార్థులు పోటీ పరీక్షల వైపు దృష్టి సారించాలి

■  నిఘా నేత్రాలతో నిర్భయంగా ఉండొచ్చు

■  చట్టానికి లోబడి సమాజం నడవాలి

■  నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల  పరిరక్షణ  కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం 

★ పెద్దపల్లి ఏసిపి సారంగపాణి ★

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లికమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి  జోన్ సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో గురువారం రోజు ఉదయం మార్కండేయ కాలనీ లో *రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్(ఐజీ)*  ఆదేశాల మేరకు *పెద్దపల్లి ఏసిపి సారంగపాణి*   ఆధ్వర్యంలో ,సీఐ లు , 09 మంది SIs,సిబ్బంది మొత్తం 70 మంది  సిబ్బంది తో  సుల్తానాబాద్ మండలంలోని మార్కండేయ కాలనీ లో  పోలీసులు ఆకస్మికంగా *కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం* కార్యక్రమం నిర్వహించి  ఇళ్లను సోదాలు చేశారు.*వాహన పత్రాలు సరిగా లేని 89 వాహనాలు,  08 క్వింటాళ్ల   పిడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది.*ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ…. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం  నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి , ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందన్నారు ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని   తెలిపారు.

రౌడీషీటర్, సస్పెక్ట్ షీట్స్ ఉన్న వారికి కౌన్సిలింగ్, నిర్వహించామన్నారు.ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా ల మరియు గుడుంబా తయారీ, గంజాయిని విక్రహిచడం, పీడీస్ రైస్ అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .మొబైల్ ఫోన్ కి బానిసలుగా మారి ఆన్లైన్లో రమ్మీ పబ్జి లాంటి గేములు ఆడుతూ చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దు సూచించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడినందున ప్రభుత్వ, పోలీసు ఉద్యోగాలు సాధించడానికి పట్టుదలతో  కృషి చేయాలని అన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడి కేసులు నమోదు ఐనట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడవలసి వస్తుంది అని సూచించారు.
వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు మరియు ఇన్సూరెన్స్ గడువు ముగియాక ముందే దానిని రినివల్ చేపించుకోవాలని సూచించారు.
మహిళల భద్రతే పోలీస్ లక్ష్యం అన్నారు. మహిళల, యువతులు, చిన్నపిల్లలతో మర్యాదగా ప్రవర్తించాలి, వారిని గౌరవించాలి అన్నారు. మన కుటుంబ సభ్యులతో ఎంత మర్యాదగా ఉంటామో బయట వారితో కూడా అలాగే మెదలాలి అని సూచించారు.  శారీరకంగా ,మానసికంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు.ప్రజలు, మహిళలు ఆపద సమయంలో,  ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, యువకులు గుంపులుగా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం  అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పలు రకాల పుకార్లను నమ్మకూడదని, వాటిలో నిజానిజాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకోవాలి అని  సూచించారు.ప్రజల రక్షణ, ప్రజలకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో  ఉంటామన్నారు. ప్రజలకు భద్రత, భరోసా, నమ్మకం కలిగించే   క్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.  దీనికి ప్రజలు సహకరించాలని కోరారు.కాలనీలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మనకు తెలియనటువంటి నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్లను, లింకును, ఓపెన్ చేయొద్దు అని, అత్యాశకు పోయి  ఆపదలు కొని తెచ్చుకోవద్దని సూచించారు.లాటరీ వచ్చిందని, లోన్ వచ్చిందని వచ్చిన, ఏదైనా గిఫ్ట్ లు వచ్చాయని  ఫోన్ కాల్స్ వచ్చిన మెసేజ్ లు వచ్చినా వెంటనే వాటికి సమాధానమిస్తూ ఓటిపి లను పిన్ నెంబర్ లను చెప్పకూడదు అన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ట్లయితే వెంటనే 1930 లేదా డయాల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ రాజు సీసీ కెమెరాల ఏర్పాటుకు 25 వేల విరాళం అందించారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీ ఐ ఇంద్రసేనారెడ్డి , పెద్దపల్లి సి ఐ ప్రదీపకుమార్, సుల్తానాబాద్, పెద్దపల్లి  సర్కిల్స్ ఎస్ఐలు ఉపేందర్, వినిత, వెంకటేశ్వర్లు,లక్ష్మణ్, వెంకటకృష్ణ, రాజవర్ధన్, శివాని, రవీందర్ మరియు 70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.