అగ్నిధారన్యూస్ (నస్పూర్)
ప్రభుత్వ మాజీ విప్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆయన సతీమణి మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వారు ఢిల్లీలో కలిశారు. అనంతరం నల్లాల ఓదెలు దంపతులకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్లాల ఓదెలు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున చెన్నూర్ నుండి పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఓదెలు 2010 జూలై 30న జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. 2014 లో జరిగిన తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర విప్ గా బాధ్యతలు స్వీకరించారు.