అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:
*మహిళల పై హింస నివారణకు కృషి::జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ*
• *మహిళా హెల్ప్ లైన్ 181 పట్ల విస్తృత ప్రచారం కల్పించాలి*
• *445 కేసుల పరిష్కారం*
• *మహిళలను వేదిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు*
• *సఖీ కేంద్రం వద్ద 2 మహిళా హోం గార్డులను కేటాయించాలి*
• *మహిళల సంరక్షణ పై జిల్లా స్థాయి సమన్వయ కమిటితో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ *
పెద్దపల్లి అక్టొబర్ 20:-. మహిళల పై జరిగే హింస నివారణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని , దీని కోసం అవసరమైన అన్ని చర్యలు పకడ్భందిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళల సంరక్షణ పై జిల్లా స్థాయి సమన్వయ కమిటితో బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. *వరకట్న వేధింపులు, గృహహింస, లైంగిక హింస, ఆడపిల్లల రవాణా, పనిచేసే చొట వేదింపులు మొదలైన సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణ, కౌన్సీలింగ్, న్యాయ సలహలను అందించేందుకు సఖీ కేంద్రాలను నిర్వహిస్తున్నామని తెలిపారు* జిల్లాలో ఇప్పటి వరకు 10 సైబర్ నేరాలు, 5 వరకట్న వేదింపుల కేసులు,422 గృహహింస కేసులు, 3 మెంటల్ స్ట్రెస్ కేసులు, 26 మిస్సింగ్ కేసులు, 5 సెక్సుల్ వేదింపుల కేసులు, 5 పోస్కో కేసులు, 6 బాల్య వివాహ కేసులు, 45 ఇతర కేసులు మొత్తం 527 కేసులు నమోదు అయ్యాయని, వాటిలో ఇప్పటి వరకు 445 కేసులను పరిష్కరించామని అధికారులు వివరించారు. పెద్దపల్లి లో ఏర్పాటు చేసిన సఖీ కేంద్రం నిర్వహణ పట్ల అధికారులు పిపిటి ద్వారా వివరించారు. మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 181 పట్ల అవగాహన కల్పించాలని, దీని పై సామాజీక మాధ్యమాలోవిస్తృతప్రచారంకల్పించాలనిసూచించారు *జిల్లాలో నిర్వహించే మహిళా సంఘాల
సమావేశాలో సఖీ కేంద్ర నిర్వహణ వారిచే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ గ్రామీణాభివృద్ది కారిని, పంచాయతిలలో సైతం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతి అధికారిని కలెక్టర్ ఆదేశించారు* సఖీ కేంద్రం ద్వారా మహిళలకు అందే సేవలకు సంబంధించిన అంశాలను వివరించాలని, హింసకు గురవుతున్న మహిళల సంరక్షణ కోసం పోలిసు అధికారుల సహకారంతో అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని, వారికి అవసరమైన న్యాయసలహలు అందించాలని కలెక్టర్ సూచించారు. *సఖీ కేంద్ర నిర్వహణ కోసం 2 మహిళా హోం గార్డులను కేటాయించాలని అధికారులు విజ్ఞప్తి చేయగా, వెంటనే స్పందించిన కలెక్టర్ సఖీ కేంద్రం వద్ద 2 మహిళా హోం గార్డులకు విధులు కేటాయించాలని డిసిపిని ఆదేశించారు* సఖీ కేంద్రంలో వచ్చిన కేసు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సఖీ కేంద్రంలో కొవిడ్ 19 వైరస్ నియంత్రణ చర్యలు సైతం పాటించాలని , అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. గృహహింసకు గురవుతున్న కేసులలో భాగంగా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో ప్రాధాన్యత కల్పించి చికిత్స అందించాలని, అదే విధంగా ప్రాథమిక చికిత్స కిట్లను సఖీ కేంద్రానికి సైతం అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
డిసిపి రవీందర్, జీల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీధర్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా పంచాయతి అధికారి చంద్రమౌళీ, జీల్లా వైద్యారొగ్య శాఖ అధికారి డా.ప్రమోద్ కుమార్, జీల్లా విద్యాశాఖ అధికారి మాధవి, సంబంధిత అధకారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.
