■ జూలపల్లి ప్రజాప్రతినిధులు కొండగట్టులో దర్శనం.
■ జిల్లాలో కాక పుట్టిస్తున్న రాజకీయం.
■ చర్యలు చేపట్టకుంటే నష్టం తప్పదు.
■ మంత్రి సమావేశానికి హాజరు కాని ప్రజా ప్రతినిధులు.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి జిల్లా మంత్రి ,జెడ్ పి చైర్ పర్సన్, స్థానిక ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లా జిల్లాకి సంబంధించిన ముఖ్య ప్రతినిధులు అందరూ హాజరైన… ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధిలు జూలపల్లి కూసుకుంట్ల రమాదేవి ఎంపీపీ , జూలపల్లి బొద్దుల లక్ష్మణ్ జెడ్ పి టి సి , మండలంలోని సర్పంచులు నర్సింగ్ యాదవ్,మేచినేని సంతోష్ రావు,పోలవేని వీరయ్య,సోల్లు పద్మ-శ్యామ్,కొత్త రవిశకుంతల,రేచవేని రాధ-శ్రీనివాస్,తొంటి పద్మ-బుచ్చయ్యఎంపీటీసీలు మెుగురం రమేష్ వైస్ ఎంపీపీ తమ్మడవేని మల్లేషం,దండే వెంకటేష్,,పల్లె స్వరూప-ప్రసాద్,మండల పార్టీ అధ్యక్షులు శాతాల్ల కాంతాయ్య, కుంట రాజేశ్వర్ రెడ్డి, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
బాలరాజుపల్లి ఉపసర్పంచ్ అడువాల తిరుపతి మొదలైనవారు, హాజరు కాలేదని విశ్వాసనీయ సమాచారం, ఇప్పుడు ఇది జిల్లాలో జిల్లా టిఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుంది. అది పోను అందరూ కలిసి ముక్కుముడిగా కార్యక్రమం బహిష్కరిస్తూ ? కొండగట్టులో దర్శనం ఇవ్వడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మరోమారు టిఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అనైక్యతను తెలియ చేస్తుంది. మంత్రి ,ఎమ్మెల్యే హాజరైన సమావేశానికి జూలపల్లి మండల ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడానికి కారణం ఒక వ్యక్తి యొక్క ఒంటెద్దు పోకడలు కారణంగా తెలుస్తుంది. మంత్రి ,ఎమ్మెల్యే పైన కోపం లేకపోయినప్పటికీ ఆ వ్యక్తి మీద కోపంతో సమావేశానికి ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదని తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అని పెద్దపల్లి నియోజకవర్గ, జిల్లా ,ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టనట్లయితే పార్టీకి భారీ మొత్తంలో నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
