అగ్నిధారన్యూస్ ( రామగుండంకమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ కేంద్రం లోని ఐబీ చౌరస్తాలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) ఓవర్ లోడ్ తో వెళ్తున్న కర్ర లారీలను ఆపారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…లారీలు ఓవర్ లోడ్, అతి వేగం వలన తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి. లారీకి బయటకు వచ్చే లాగా కర్ర లు ఉండడం వలన విద్యుత్ తీగలకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అని ఓవర్ లోడ్ ఉండడం వలన డ్రైవర్స్ కి లారీ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం అవుతుంది ప్రమాదాలు జరుగుతాయి అన్నారు. అధిక లోడ్ వలన లారీ లు రిపేర్ లు వచ్చి రోడ్డు ఫై ఆగిపోవడం వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది అన్నారు. వారం రోజుల తరువాత రామగుండం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అన్నారు. నిబంధనలకు మించి ఓవర్ లోడ్ తో కర్ర లారీలు కనిపిస్తే సీజ్ చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆపిన లారీలలో ఓవర్ లోడుతో ఉన్న లారీలకు ఫైన్ లు వేసి పంపించాలని మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు, వాహనదారులు సి పి చంద్రశేఖర్ రెడ్డి చేపట్టిన చర్యలకు హర్షం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

