అగ్నిదారన్యూస్ ( సంగారెడ్డి ) సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాయిపేట గ్రామంలో ఈ నెల 20/06/2022(సోమవారం ) రోజు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న క్రమంలో శుక్రవారం రోజు జోగిపేట సీ ఐ నాగరాజు, ఎస్ ఐ తన సిబ్బందితో కలిసి ముందస్తుగా భద్రత విషయంలో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంగన్న , సర్పంచ్ సంగీత మల్లేశం, గ్రామ కార్యదర్శి మల్లేశం ,గ్రామ trs అధ్యక్షుడు ని౦గాపుర౦ మొగులయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

