అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి సుధాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీని వీడి గురువారం రోజు తిరిగి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం ఎంపిటిసి వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు.జండా కూడలిలో తెలంగాణ జేఏసీ చేపట్టిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు .అదేవిధంగా దివంగత నేత మాజీ ఎమ్మెల్యే ముకుంద రెడ్డికి అతి సన్నిహితుడిగా పేరొందిన వ్యక్తి కట్కూరి సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మీద ఉన్న మమకారంతో మళ్లీ కాంగ్రెస్ లోకి చేరుతున్ననన్నారు. నియోజకవర్గంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్న క్రమంలో ప్రజల అభిమానులకు కోరిక మేరకు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సాయ శక్తుల కృషి చేస్తానన్నారు. విజయ రమణారావును ఎమ్మెల్యేగా చేసేంత వరకూ విశ్రమించేది లేదన్నారు.ఈ సందర్భంగా తనతో పాటు వివిధ పార్టీల నాయకులు తటస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు అన్నారు.
