గొఱ్ఱెల కాపరులారా అప్రమత్తం గా ఉండండి..:: పోచబోయిన శ్రీహరి యాదవ్ సూచన…
అగ్నిధారన్యూస్( మెదక్ జిల్లా) రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు గొఱ్ఱె మేకలకు అత్యంత గడ్డుకాలం, గొల్ల కురుమలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి మెదక్ జిల్లా గొఱ్ఱెల పెంపకం దారుల సహకారయూనియన్ అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ సూచించారు.
నేడు సిద్దిపేట లోని శ్రీకృష్ణ యాదవసంఘం లో సిద్దిపేట జిల్లా యాదవ సంఘ నాయకులు మామిండ్ల ఐలయ్య యాదవ్, పయ్యావుల రాములు యాదవ్, జక్కుల బాలమల్లుయాదవ్, పత్తి వెంకటేశం యాదవ్, రాజబోయిన పర్శరాములు యాదవ్ మరియు పోచబోయిన గోవిందగిరి స్వామి యాదవులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ….. ఎడతెరిపి లేని వర్షాలు అత్యంత ప్రమాదకరమని ఈ సమయంలో ఎత్తయిన గెరువు ప్రాంతంలో మందఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని,ఎవరైనా వాగుల్లో లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా విపత్కర సందర్భాలలో 100 కి లేదా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ చేయాలని సూచించారు.. వ్యాధులు ప్రభలకుండా, గొర్ల దొడ్లను సున్నం వేసి,పొడిగా ఉండేలాచూసుకొని , నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అందించే వైద్యం వాక్సియేషన్ తదితర సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
