అగ్నిధార న్యూస్ కరీంనగర్

*దళితబంధు పథకాన్ని ఆపించి బిజెపి నాయకులు రాక్షసానందం పొందుతుండ్రు-      మంత్రి కొప్పుల ఈశ్వర్*

జమ్మికుంటలోని 9,11,12 వార్డు లలో శుక్రవారం మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

*ఈ సందర్భంగా మంత్రి కామెంట్స్*
 ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప మనస్సున్న మనిషి, మానవతా మూర్తిపేదరికంతో నానా బాధలు, కష్టాలు పడుతున్న దళితుల జీవితాలలో గుణాత్మకమైన మార్పు తెచ్చే దృఢ సంకల్పంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.
దీన్ని విజయవంతంగా అమలు చేస్తూ ముందుకు సాగుతుంటే,దళితులు బాగు పడడం ఏ మాత్రం ఇష్టంలేని బిజెపి నాయకులు దీన్ని ఆపించిండ్రు
ఉరుకుతున్న వారి కాళ్లలో కట్టెలేసే రకం ఈ బిజెపి నాయకులు.. ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఈ పథకాన్ని ఆపించిండ్రుమనం బాగు పడుతుంటే ఓర్వలేని వాళ్లు ఈ బిజెపి,దీని నాయకులు రాక్షసానందం పొందుతుండ్రు కేంద్రంలో అధికారంలో బిజెపి దేశానికి,మన రాష్ట్రానికి,ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు*
ఆ పార్టీ నాయకులు ఏమి చేయకపోగా,చేసే వారిని చేయనివ్వకుండా అడుగడుగునా అడ్డుతగులుతుండ్రు
కరీంనగర్ ఎంపిగా గెలిచిన బండి సంజయ్ మీ వాడకు ఎప్పుడైనా వచ్చిండా, ఏమైనా నిధులిచ్చిండా, చిన్న పనైనా చేసిండా,తట్టడు మన్నైనా ఇక్కడ పోసిండా?అని మంత్రి కొప్పుల ప్రజలను అడిగితే..లేదు లేదు అని బదులిచ్చిండ్రు టిఆర్ఎస్ పార్టీని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ కూడా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు..ఇక ముందు కూడా ఏమి చేయ్యడు బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఏం చేయ్యలే, పొరపాటున ఈటల గెలిచినా కూడా ఢిల్లీ నుంచి నిధులు తేలేడు,ఇక్కడ ఆయన ప్రతిపక్షమే..మంత్రిగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గాన్ని ఏ పట్టించుకోని, అభివృద్ధి చేయని రాజేందర్ కు ఓటేస్తే మీ అందరికి తీవ్ర నష్టం జరుగుతుంది మనందరి కోసం ప్రతి నిత్యం ఆలోచించే పనికి చేసే కెసిఆర్ కు సంపూర్ణ మద్దతునిస్తే హూజూరాబాద్ గొప్పగా అభివృద్ధి చెందుతుంది
కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనును భారీ ఓట్లమెజారిటీతో గెలిపించండి, మీకు ఏకష్టంవచ్చినా,నష్టం వచ్చినా కొండంత అండగా ఉంటామన్నారు.