అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమాన్ చౌరస్తా వద్ద గల ప్రాంతం నిత్యం వేలాది వాహనాలతో రాకపోకలు సాగుతుంటాయి అదేవిధంగా ప్రధాన న కేంద్రమైన కమాన్ చౌరస్తా గుండ జిల్లాలోని అన్ని గ్రామాల మండలాల ప్రజలు రోజు వేల సంఖ్యలో రకరకాల పనుల మీద iప్రధాన రహదారికి దగ్గరలో ఉన్నటువంటి కమాన్ చౌరస్తా వద్దనుండి పెద్దపల్లిలో ప్రధాన కూడలి అయిన జండా చౌరస్తా కి వెళ్లాల్సి ఉంటుంది ఈ క్రమంలో
ప్రధాన రహదారి అయిన కరీంనగర్ నుండి వచ్చే వాహనాలు గోదావరి ఖని నుండి వచ్చే వాహనాలు కమాన్ చౌరస్తా దాటుకుంటూ వెళుతుంటాయి ఈ క్రమంలో ప్రధాన రహదారిని దాటుకుంటూ కమాన్ లోకి వచ్చిపోయే ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల నిరంతర అవిరామ కృషి ఫలితంగా వచ్చి పోయి జనాలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ట్రాఫిక్ను నియంత్రిస్తూ ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు .అయినప్పటికీ కమాన్ చౌరస్తా వద్ద మరియు పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ నిర్మించాలని భారతీయ జనతా జిల్లా దళిత మోర్చా నాయకులు పార్టీ పల్లె సదానందం ఉన్నతాధికారులను కోరారు.
