అగ్నిధారన్యూస్ “(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అందోల్ మండలం సంగుపేట వద్ద ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వేడుకలు నిర్వహించారు. ఆందోల్ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు చెందిన 125 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలను అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ రాయికోడ్ మండల జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ఉపాధ్యాయుడు రవీందర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ నాయకులు ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మెన్ సిద్ధన్నపాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ చేవెళ్ల విఠల్, ఎంఈఓ శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శి శంకర్, రాయికోడ్ మండల టిఆర్ఎస్ యువ నాయకులు ముఖ్య నాయకులు తదితరులు ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు.