అగ్నిధారన్యూస్ (సంగారెడ్డి)  మంగళవారం రోజు మొగుడంపల్లి మండలం ,దనశ్రీ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి పల్లకి సేవను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో 3 రోజుల నుండి వివిధ కార్యక్రమాలు విధిగా ప్రతి ఏడాది నిర్వహిచుకుంటారు. అందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున దనశ్రీ లో కులాలకు,మతాలకు అథితంగా ఇండ్లను శుభ్రం చేసుకుని ప్రతి ఒక్కరు తలంటు స్నానం ను నిర్వహించి శ్రీ మల్లికార్జున స్వామి వారి పల్లకి సేవకు సిద్ధం అవుతారు.ఈ ఊరేగింపులో ఏ మతం వారు అయిన కూడా కాళ్లకు చెప్పులు వేసుకోకుండా పల్లకి సేవ ఉత్సవం లో పాల్గొంటారు.అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా దనశ్రీ గ్రామం నుండి ఆడపడుచులను సుదూర ఇతర గ్రామాలకు పెండ్లి చేసి పంపిన వారిని అందరిని తమ ఇండ్లకు పిలిపించుకుని,ఈ పల్లకి ఉత్సవం కు కొత్త శోభను సంతరించుకుంటరు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తితో ఈ పల్లకి సేవలో పాల్గొంటారు.గ్రామంలో చాలా సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు.విద్యార్థుల కోలాటాలు, పెద్దవారి చిటికెల విన్యాసాలు, రకరకాల సంగీత వాహిద్యాలతో పాటలు, నాట్యాలు నిర్వహించారు.గ్రామానికి విచ్చేసిన అందరికి అన్నదానం ను ప్రసాదిస్తాడు.నిజంగా దనశ్రీ పేరును సార్థకనామం గా మలచిన వీరసైనికులు పుట్టిన గడ్డ ,మాతృ దేశ సేవ చెయ్యడానికి దనశ్రీ గ్రామం నుండి దాదాపు 100 కుటుంబాల నుండి ఎంతో మంది దేశ రక్షణ లో ఉన్నారు.విద్యావేత్తలు,స్కాలర్ లు,ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, లకు పెట్టింది పేరు. పేరుకు తగ్గట్లుగానే నిజంగా ధనం తో నిత్యం తులతూగే ఈ నాటి దనశ్రీ.ఆ మల్లికార్జుని దయ వలన ఎంతో అభివృద్ధి ని సాధించింది ఆ గ్రామ.అయితే దనశ్రీ లో చాలా సంవత్సర క్రితం ఒక వీరశైవ మఠం కూడా గ్రామంలో ఉండి మనుషులను సత్రావర్తన, అత్యాద్మిక వైపు నడిపించింది.