■  మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో స్వచ్ఛత కరువు.

■  కంపు కొడుతున్న పాఠశాల ప్రాంగణం.

■  ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం.

■  పట్టించుకోని అధికారులు.

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా)  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం మనకు తెలిసిందే అదే విధంగా పెద్దపల్లి జిల్లా స్వచ్ఛతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జిల్లాకు అవార్డు ప్రకటించిన విషయం విధితమే జిల్లాలో పారిశుధ్యం ఎలా ఉందో పక్కన పెడితే… రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 11 వరకు గురుకుల పాఠశాలలో పకడ్బందీగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణను చేపట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదిశగా పగడ్బందీగా చర్యలు చేపట్టారు. ఇటీవలే కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఎస్సీ గురుకులాలలో చేపట్టే *స్వచ్చ గురుకుల* పోస్టర్ కూడా ఆవిష్కరించారు .ప్రకటించిన కార్యక్రమాలను గురుకులాలలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురుకులాలలో సెప్టెంబర్ 5న చెత్త తొలగింపు, సెప్టెంబర్ 6న పాఠశాల భవనం, పడక గదులను శుభ్రం చేయడం, సెప్టెంబర్ 7న టాయిలెట్స్ నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, పారిశుధ్య ప్రాముఖ్యతపై విద్యార్థులకు పోటీ నిర్వహించడం జరుగుతుందని, సెప్టెంబర్ 8న పాఠశాల కిచెన్, డైనింగ్ ఏరియా పరిసరాలను పరిశుభ్రం చేస్తామని, సెప్టెంబర్ 9న గురుకుల పరిసరాలలో మొక్కలతో సుందరీకరించడం, సెప్టెంబర్ 10న సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సెప్టెంబర్ 11న వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇంతవరకు బాగానే ఉంది….స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాలోని గురుకుల పాఠశాలలు స్వచ్ఛత ఆకర్షణీయ అహల్లాదకర వాతావరణం వైపు అడుగులు వేస్తాఉంటే …పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో మాత్రం స్వచ్ఛత కరువు,

. దాదాపు ఆరు వందల పైచిలుకు విద్యార్థులు ఉన్న పాఠశాలలో చాలీచాలని సౌకర్యాలతో సతమతమవుతున్నారు. ,రాష్ట్రం ప్రభుత్వం గురుకులాలను స్వచ్ఛత వైపు పరుగులు తీయిస్తూ ఉంటే ఇక్కడి పాఠశాలలో మాత్రం అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. నిత్యం వందలాదిమంది విద్యార్థులు వినియోగించే బాత్రూం, టాయిలెట్స్, మరుగుదొడ్ల నుండి దుర్గంధం వెదజల్లే మురుగునీరు ,పాఠశాల ప్రాంగణంలో పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంకుల నుండి బుసలు కొడుతూ, విషం చిమ్ముతు, పాఠశాల పరిసరాలలో పారుకుంట పోయి, కంపును వెదజల్లుతు,

పరిసరాలను కలుషితం చేస్తున్న, పట్టించుకున్న పాపాన పోయిన అధికారులు గానీ, నాయకులు గానీ లేరు. ప్రతినిత్యం కాలువల పారే మురుగు నీరు పైనుండి అధికారులు పాఠశాల సిబ్బంది వస్తు పోతూ ఉంటారు, కానీ సమస్యను పరిష్కరించలనే  ధ్యాస లేకపోవడం విచారకారం పాఠశాల పరిశుభ్రత పట్ల ఏమాత్రం పట్టింపు ఉందో ఇట్లే తెలుస్తుంది. ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించే మార్గాలను అన్వేషించకుండా కాలయాపన చేయడం అనేక విమర్శలకు తావిస్తుంది. జిల్లా కేంద్రానికి దూరంలో వ్యవసాయ క్షేత్రాలలో ఉన్నందున అటువైపు ఎవరు వస్తారులే, మమ్ములెవరు,చూస్తారులే ,అని అనుకునే అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది.ఇప్పటికైనా వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రాణాంతకమైన వ్యాధులు ప్రభలక ముందే సంబంధిత అధికారులు గాని, జిల్లా కలెక్టర్ గాని స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.