వినియోగదారుల ఫోరం  మండల అధ్యక్షులుగా సబ్బు సతీష్

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)  తెలంగాణ వినియోగదారుల ఫోరం మండల అధ్యక్షులుగా సబ్బు సతీష్ నియామకం చేసినట్లు తెలంగాణ వినియోగదారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు బిందె నాగభూషణం, ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్ మంగళవారం నియామక పత్రాన్ని సబ్బు సతీష్ కు అందజేశారు. ఈ సందర్భంగా సబ్బు సతీష్ మాట్లాడుతూ… తెలంగాణ వినియోగదారుల ఫోరం పెద్దపల్లి మండల అధ్యక్షునిగా నన్ను నియమించిన జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండల వ్యాప్తంగా వినియోగదారులకు ఎటువంటి అన్యాయం జరిగిన తమ వినియోగదారుల ఫోరం  దృష్టికి తీసుకువస్తే తగు న్యాయం చేస్తామని  తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పెంచికల రమ్య,, కుందారపు శిరీష, కడివెండి ఉమా, బొద్దుల అరుణ ,తదితరులు పాల్గొన్నారు.