అగ్నిధార న్యూస్: (ధర్మారం)కేంద్ర ప్రభుత్వం వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ల ధరను పెంచడం నిరసిస్తూ గురువారంరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో కరీంనగర్- రాయపట్నం రహదారిపై భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిలిండర్ల గ్యాస్ పెంపు పట్ల పీఎం నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మహిళలు పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నంది మేడారం పాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు సిలిండర్ గ్యాస్ భారం మోపిందని అన్నారు. ఇప్పటికే పెట్రోల్ ,డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేద ప్రజల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఆయన విమర్శించారు. అట్టి ధరల పెంపు మరవకముందే మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజలపై కక్ష కట్టి వాణిజ్య, గృహ ఉపయోగకరమైన సిలిండర్ల గ్యాస్ ధరను ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున పెంచడానికి తీవ్రంగా నిరసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రజలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కురు జితేందరావు, రైతుబంధు మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మరియు నాయకులు, మహిళ నాయకులు పాల్గొన్నారు.