అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం పురస్కరించుకొని సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మామిడి తోరణాలు, రంగవల్లులు, పూలదండలతో పాఠశాలను అలంకరించి, ఉదయం ఏడు గంటలకు విద్యార్థులతో ర్యాలీ తీసి, మానవ హారంగా ఏర్పడి, జెండా ఎగరవేసి సభ ను ఏర్పాటు చేసి, ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాసర్ల అంజలి అనంతరెడ్డి ఏడవ తరగతి లో ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉన్న విద్యార్థులకు జ్ఞాపిక మరియు సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి కోటేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలలో ప్రభుత్వ సహాయంతో జరిగే మన ఊరు మనబడి సౌకర్యాలను , తొలిమెట్టు మరియు యఫ్ఎల్ఎన్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాల ఉంటాయనిఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వ బడులకు పూర్వ వైభవము తీసుకువచ్చే దిశగా గ్రామ పెద్దలు, ప్రభుత్వంతో మమేకమై ముందుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా రైతుబంధు అధ్యక్షులు కాసర్ల అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు కి పంపే ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తప్పకుండా మనసుద్దాల ప్రభుత్వ పాఠశాలకు పంపించాల్సిందిగా తీర్మానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అధికారులు పాల్గొన్నారు.

