బిగ్ బ్రేకింగ్;  ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు తృటిలో తప్పిన ప్రమాదం.

అగ్నిధారన్యూస్(బోథ్): శనివారం సాయంత్రం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు తృటిలో ప్రమాదం తప్పి క్షేమంగా,  తన సిబ్బందితో బయట పడడంతో కార్యకర్తలు నాయకులు  ఊపిరి పీల్చుకున్నారు.ఈ సంఘటన  ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం కొరిటికల్ వద్ద జరిగింది. ఎమ్మెల్యే వెళ్తున్న వాహనానికి ఎదురుగా అకస్మాత్తుగా ఆవు అడ్డంగా రావడముతో,  డ్రైవర్ బ్రేక్ వేయడముతో పక్కనే ఉన్న డివైడర్ కు ఎమ్మెల్యే వాహనం ఢీకొట్టగా వాహనం ముందు భాగం దెబ్బతింది.  బెలూన్లు తేర్చుకోవడమూతో ప్రమాదం నుండి బయట పడ్డారు, ఎమ్మెల్యే ప్రస్తుతం బోథ్ హాస్పిటల్ లో ప్రథమ చికిత్స  పొందుతున్నారు.