అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి వ్యవస్థలో ఒకటైన విద్యా వ్యవస్థను పటిష్ట పరచడానికి చేపట్టే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రైమరీ యుపిఎస్ పాఠశాలలలో 165 లోపు విద్యార్థులు ఉన్నట్లయితే ఆ పాఠశాలకు ఒక ట్యాబ్ 165 ఆ పైన ఉన్న పాఠశాలలకు రెండు ట్యాబ్ లను పంపిణీ చేయడం జరుగుతుంది. పంపిణీ చేయబడిన ట్యాబ్ లలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఆ పాఠశాలకు సంబంధించిన వివరాలు ఈ విధంగా నమోదు చేయాలి. 1 TAB ను. పాఠశాలల్లోని పిల్లల నమోదు కొరకు UDISE+ (Child/Teacher /School Info) ల Entry కొరకు ఉపయోగించాలి. 2. FLN/CCE/MOMB DATA ENTRY కొరకు.3 DAILY MDM DATA ENTRY కొరకు. 4 ISMS / SHAGUN /DIKSHA PORTAL మరియు ఏవైనా ఇతర కార్యకలాపాలు చేయుటకు. 5 DIKSHA లో అందుబాటులో ఉన్న DIGITAL CONTENT రూపాంతరం కోసం, విద్యార్థులకు సంబంధించిన 1 to 5 తరగతులపాఠాల Videos YouTube ఛానెల్‌లో మొదలైనవి. పెద్దపల్లి జిల్లా లోని 14 మండలాల్లోని యుపిఎస్ పిఎస్ లో పాఠశాలలకు సంబంధించిన ట్యాబ్ కోసం శనివారం ఏడు మండలాలకు పంపిణీ చేయగా సోమవారం నాడు రామగుండం, అంతర్గాము కమాన్ పూర్, రామగిరి ,ముత్తారం ,మంథని పాలకుర్తి 7 మండలాల్లోని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ట్యాబ్ ల పంపిణీ చేపట్టారు.ఉదయం 9 గంటలకు వచ్చిన ప్రధానోపాధ్యాయులు సాయంత్రం 3:30 గంటల వరకు సర్వర్ పని చేయకపోవడంతో మండల విద్యా కార్యాలయం,భవిత కేంద్రాల వద్ద పడిగాపులు కాయవలసి వచ్చిందని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన వారికి కనీస వసతులు కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయనీలు ఇబ్బందులు పడ్డారు.

