పండగపూట విషాదం.

గడ్డి తీస్తుండగా పాముకాటు.

 ఆసుపత్రికి తరలించిన దక్కని ప్రాణం

అరగంటలో అలుముకున్న విషాదం.

పాము కాటుకి ఎంచర్ల లక్ష్మీ
మృతి.

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)
పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన
ఎంచర్ల లక్ష్మి, గురువారం రోజు సాయంత్రం పాముకాటు గురి అయింది. విశ్వాసనీయ సమాచారం ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు తన చేనులో వ్యవసాయ పనులు చేసింది.
సాయంకాలం దాదాపు 7 గంటల సమయంలో తన ఇంటి వద్ద ఉన్న వరి గడ్డిని ఆవుకి మేత వేద్దామని గడ్డి తీస్తున్న సమయంలో, తన కాలికి ఏదో కరిసినట్లు,గుర్తించిన లక్ష్మి వెంటనే ఇంటికి వచ్చి చూడగా కాలికి రక్తం కారడం గ్రహించి పాము కాటు వేసినట్లుగా గుర్తించింది. విషయం ఇంటి చుట్టూ ఉన్న వాళ్లకు తెలియగా స్థానిక పి.ఎం.పి సహాయంతో హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు తెలిసింది. అప్పటివరకు తమతో కలివిడిగా తిరుగుతూ, అరగంటలోనే లక్ష్మీ కానరాని లోకాలకు వెళ్లడంతో ఇంటిలో, గ్రామంలో, ఒక్కసారిగా పండగ పూట విషాదశాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.