అగ్నిధారన్యూస్ (ఎలిగేడు ) ఎలిగేడు మండలం కేంద్రంలోని శివపల్లి గ్రామంలో శుక్రవారం రోజు దాదాపు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో దుగ్యాల వెంకట్రావు తన సొంత పనుల నిమిత్తం బయటకు వెళ్లగా అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఘటన స్థలాన్ని సుల్తానాబాద్ సి ఐ జగదీష్  జూలపల్లి ఎస్ ఐ వెంకటకృష్ణ సంఘటన స్థలాన్ని సందర్శించారు. జరిగిన సంఘటనపై ఎస్ ఐ వెంకటకృష్ణను చరవాణిలో వివరణ కోరగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.