అగ్నిధారన్యూస్, జూలపల్లి:
ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన గుర్రం విష్ణు ప్రసాద్ తన యొక్క మొబైల్ ఫోన్ ను ఎలిగేడు నుండి జూలపల్లి కి వచ్చేమార్గం లో ఎక్కడో పడవేసుకుని అట్టి విషయాన్ని జూలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని కేవలం నాలుగు రోజుల్లో గుర్తించి బుధవారం రోజు బాధితునికి ఎస్సై వెంకటకృష్ణ ధ్వారా అందజేశా రు.పోయిన తన మొబైల్ ను ను గుర్తించి అప్పగించినందుకు బాధితుడు పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా వారి యొక్క సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోగలరని, ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని ఇట్టి అవకాశంని ప్రజలు అందరు సద్వినియోగంచేసుకోగలరని తెలిపారు.
