అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి కలెక్టరేట్ )     పెద్దపల్లి జిల్లా నూతన అదనపు కలెక్టర్ గా జి.వి. శ్యాంప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా పెద్దపల్లికి బదిలీ అయిన సంగతి తెలిసిందే, కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జి.వి.శ్యాంప్రసాద్ లాల్ పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్లో   బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయ పరుస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.
అనంతరం తన క్యాంపు కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.