అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శివ పల్లి గ్రామానికి చెందిన అమ్ముల బుచ్చయ్య అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. పెద్దపల్లి నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఇటుక లారీ అదుపుతప్పి రోడ్డుపైన పడిపోయింది అదే సమయంలో శివ పల్లికి చెందిన వ్యక్తి ఆవులకు పశు గ్రాసం పట్టుకొని   సైకిల్ మీద వెళుతున్న క్రమంలో ఒకసారిగా పడిపోయిన ఇటుక లారీ కింద పడి చనిపోవడంతో రాజీవ్ రహదారి పైన ఉద్రిక్తత నెలకొంది. సంఘటన స్థలానికి సుల్తానాబాద్ సీఐ జగదీష్ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది రుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.