చల్మెడ లక్ష్మీ నరసింహా రావు
అగ్నిధారన్యూస్ (జగిత్యాల)జిల్లా మేడిపల్లి మండలం లోని పలు గ్రామాలలో గురువారం వేములవాడ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు పర్యటించాడు. ఈ పర్యటణలో,కంటి సమస్యతో బాధపడుతున్న వల్లంపల్లి గ్రామానికి చెందిన చిన్నారి కొప్పెర కీర్తికి,చల్మెడ కృషితో హైదరాబాద్ లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో విజయవంతంగా చిన్నారి కీర్తి కంటి శస్త్ర చికిత్స గురించి,ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి, అన్ని తానై వ్యవహరించడం జరిగింది. లక్ష్మి నరసింహ రావు మీ సాయం మర్చిపోలేం,మీ రుణం తీర్చుకోలేం అంటూ చల్మెడకు ప్రత్యేక కృతజ్ఞతలు కీర్తి తండ్రి కృష్ణారెడ్డి తెలిపారు. అదేవిధంగా లక్ష్మీ నరసింహ రావు పలు గ్రామలలోని ప్రజలను, పార్టీ కార్య కర్తలను, ప్రజా ప్రతినిధులు లను కలుసుకోవడం జరిగింది.
