రేపే ముహూర్తం ఖరారు
అగ్నిధారన్యూస్, మానకొండూర్: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. గురువారం ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత గులాబీ కండువా కప్పుకున్న ఆయనకు బిఆర్ఎస్ పార్టీలో ఆశించినంత ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కెసిఆర్ సుముఖత చూపకపోవడంతో, ఆయన నిరాశ చెంది బుదవారం రోజు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ని కలిసి సుదీర్ఘంగా సమాలోచనచేసి అనంతరం, ఆరెపల్లి మోహన్ కాషాయం కండువా కప్పుకునేందుకు తన అనుచరులతో గురువారం రోజున ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆరేపల్లి మోహన్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో చేరనున్నారు. ఆరేపల్లి మోహన్ ను బిజెపి తరుపున మానకొండూర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి మరి.
