మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు
– డివిజన్ అధ్యక్షుడు పార్వతి కిరణ్
అగ్నిధార న్యూస్ మంథని :
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినందుకు మంథని మున్నూరు కాపు సంఘం డివిజన్ అధ్యక్షుడు పార్వతి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు కొద్దీ రోజుల క్రితం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించినట్లు కిరణ్ పేర్కొన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించి మేనిఫెస్టోలో పొందపరిచినందుకు మంథని నియోజకవర్గ మున్నూరు కాపు సోదరుల పక్షాన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
