అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: గురువారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సత్యసాయి ట్రస్ట్ సేవ సంస్థ ఆధ్వర్యంలో టైం మేనేజ్మెంట్ అంశంపై జిల్లాస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో పెద్దకల్వల గ్రామంలోని నోబెల్ హై స్కూల్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పయ్యావుల రస్మిత జిల్లాస్థాయిలో రెండవ బహుమతి గెలుపొందింది. సత్య సాయి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రస్మితకు ట్రస్ట్ అధ్యక్షుల చేతుల మీదుగా బహుమతితోపాటు, ప్రశంస పత్రం అందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మోహన్ రాజు మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో టైమ్ మేనేజ్మెంట్ అంశం పైన నిర్వహించిన వ్యాసరచన పోటీలో మా పాఠశాల నుండి రెండవ బహుమతి రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థిని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో పాఠశాల కృషి చాలా గొప్పది అన్నారు. మేము చేపట్టే కార్యక్రమాలకు విద్యార్థులతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు ఎల్లవేళలా సహకరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రస్మిత తల్లిదండ్రులను నిర్వాహకులు ప్రత్యేక అభినందించారు.