కృతజ్ఞత తెలిపిన కుటుంబ సభ్యులు.
ప్రజల ఆరోగ్యం ముఖ్యమంటున్నా ఎమ్మెల్యే.
నిరుపేదలకు ఆసరా సిఎంఆర్ఎఫ్.
అగ్నిధారన్యూస్,( ఓదెల )ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సత్యమ్మ CMRF ద్వారా 1,25,000/- ఒక లక్ష ఇరవై ఐదువేల రూలపాయల LOC చెక్కును (NIMS హాస్పిటల్)కు ఆదివారం రోజు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు స్వయంగా అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. నిరుపేదలు, నిస్సాహస్థితిలో, అనారోగ్యంతో, ఆసుపత్రి పాలైనప్పుడు, ఆర్థికంగా నష్టపోకుండా ఉండడం కోసం, ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యంపైన, స్పష్టమైన అవగాహన కలిగి ఉందన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు విజయ రమణారావుకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, అన్నయ్య గౌడ్, అశోక్ గౌడ్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
