అగ్నిధారన్యూస్ (గోదావరిఖని)
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం నుండి నాగండ్ల రవికుమార్ కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల చైర్మన్ గా కొనసాగుతూ 2013లో విద్యా సంస్థను స్థాపించి ఇప్పటివరకు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతోమంది పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజు తో నాణ్యమైన విద్యను అందిస్తూ అలాగే సింగరేణి సంస్థలో సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ హైదరాబాద్ లోని కార్పొరేట్ సంస్థలలో పేద విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఎదుగుదలకు కృషిచేసిన నాగండ్ల రవికుమార్ కి జే సి ఐ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ (జెసిఐ) సంస్థ ప్రతిఏటా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించే పలువురి గుర్తించి పురస్కారాలు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగా 2023 సంవత్సరంలో పలు రంగాలలో సామాజిక సేవా దృక్పథంతో విశిష్ట సేవలు అందిస్తున్న పెద్దపల్లి జిల్లాలోని పలువురు సంఘ సేవకులు,వివిధ వృత్తులలో రాణిస్తున్న వారిని అవార్డులకు ఎంపిక చేసినట్లు జెసిఐ మంచిర్యాల జిల్లా చాప్టర్ అధ్యక్షులు ఆర్మూర్ల రాజు తెలిపారు.గోదావరిఖనికి చెందిన కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ నాగండ్ల రవికుమార్.నిరుద్యోగి న్యూస్ రామ్ అశోక్. ప్రముఖ న్యాయవాది మహ్మద్ తాజుద్దీన్ బాబా.సోషల్ వర్కర్ మమ్మద్ అతరుద్దీన్.మహిళా నాయకురాలు కర్నాటి సీతక్క,యువ నాయకులు రాముల కార్తీక్,పొట్ల శ్రీకాంత్,ఎన్ టి పి సి కి చెందిన సాగర్ లను ఎంపిక చేశారు. అంతర్జాతీయ సంస్థ జెసిఐ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైన వీరిని జెసిఐ ప్రతినిధులు,పలు సంఘాల బాధ్యులు, మేధావులు,పలువురు అభినందించారు.
