అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్
గత కొంత కాలం నుండి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు అనారోగ్య సమస్యతో బాధపడుతూ చికిత్స నిమిత్తమై హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆయన అనారోగ్య సమస్య తీవ్రతరం కావడంతో బిరుదు రాజమల్లు కన్నుమూశారు.
బిరుదు ప్రస్థానం ఇలా
అన్నా అని పిలిస్తే నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చి ప్రజల కష్టసుఖాల్లో ఆపదలలో ఆదుకున్న్నాడు.శత్రువైన ప్రత్యర్థి అయినా ఏమి రా.. తమ్మి అంటూ పలకరించి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. బిరుదు రాజమల్లు సుల్తానాబాద్ గ్రామపంచాయతీలో కారోబార్ గా చిరు ఉద్యోగంతో జీవనాన్ని ప్రారంభించి ఎన్టీఆర్ అభిమాన సంఘం ను స్థాపించి సర్పంచ్ గా, ఎల్ ఎం బి బ్యాంకు చైర్మన్ గా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా, ఎన్టీ రామారావు ప్రియ శిష్యునిగా, ఎమ్మెల్యేగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా అంచలంచెలుగా ఎదిగి బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల మనిషిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో పేరు తెచ్చుకొని ప్రజల మనిషి ఇలా ఉండాలని అందరికీ ఆదర్శంగా నిలిచారు.ఎంతోమంది జీవితాలకు వెలుగునిచ్చారు. ఆయన నాయకత్వంలో ఎంతో మందిని ఎంపీపీలుగా జడ్పిటిసిలుగా సర్పంచ్‌లుగా ఎంపీటీసీలుగా సింగిల్ విండో చైర్మన్లుగా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పాలకవర్గ సభ్యులుగా గెలిపించి రాజకీయ భవిష్యత్తును కల్పించారు. ఎంతోమంది కి ఉద్యోగాలు ఇప్పించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశారు. ఆయన మరణం తీరని లోటు అని పలువురు రాజకీయ నాయకులు విచారణ వ్యక్తం చేశారు.
