అమ్మవారిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు…

అగ్నిధారన్యూస్,పాపన్నపేట:

బోనాల పండుగ కన్నుల పండువగా సాగింది.పాపన్నపేటలో ఎల్లమ్మ ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.మంగళవారం గౌడ సంఘము ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.ఉదయం పెద్ద గౌడ కులస్తులు శుద్ధిగా తయారుచేసిన కల్లు కుండ, దున్నగౌడ కులస్తులు బొట్టు, వస్త్రాలంకరణ,అభరణాల సామాగ్రి ఆనవాయితీ ప్రకారం డప్పు చప్పులతో అందరూ కలిసి మంగళ హారతులతో భక్తిశ్రద్ధలతో ఆలయానికి కాలినడకన వెళ్లారు.ఒడి బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.మధ్యాహ్నం భక్తులు అమ్మవారికి పిండి వంటల నైవేద్యం సమర్పించారు.సాయంత్రం మహిళలు పెద్ద సంఖ్యలో బ్యాండ్ మేళలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పించారు.ఆలయ ప్రాంగణం ఎల్లమ్మ పాటలతో సందడి నెలకొంది.హైదరాబాద్ నుండి గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. చల్లంగా చూడమ్మా అని తల్లిని వేడుకున్నారు.మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అమ్మవారిని దర్శించుకున్నారు.గ్రామ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.