కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలి.
పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.
తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క.
అగ్నిధారన్యూస్, మంచిర్యాలజిల్లా:
ఆదివారం రోజు మంచిర్యాల జిల్లా కేంద్రoలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ముఖ్య అతిథిలుగా హాజరైన ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.పంచాయతీరాజ్ , శ్రీధర్ బాబు, సీతక్క మాట్లాడుతూ.… తెలంగాణ ఇచ్చిన ఇందిరమ్మ కుటుంబం నుంచి, కాంగ్రెస్ పార్టీకి దేశాన్ని పరిపాలించే,ఒక్క అవకాశం ఇద్దాం అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థను బలపరిచారు అన్నారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఆదుకున్నది, కాంగ్రెస్ పార్టీ అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ప్రభుత్వ విధివిధానాలు తెలుసుకొనే అవకాశం కాంగ్రెస్ ఇచ్చింది అన్నారు . బిజెపి ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ సంస్థల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు,ఆదాని,అంబానీ ల కోసం గిరిజన ప్రాంతాలలో బొగ్గు గనులు, బాక్సైట్ తవ్వకాలు చేసి, గిరిజన రైతులను, ఆదివాసి గూడాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, వాళ్లను నిర్బంధించి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. మోడీ ప్రభుత్వం చివరకు సింగరేణి కూడా అమ్మే కుట్ర చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదివాసులకు అడివి హక్కులపై హక్కులు కల్పించారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడవి హక్కుల చట్టాలకు తూట్లు పొడిచింది. గిరిజనుల ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుంది అన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ఇవ్వకుండా, రైతులను నిండా ముంచే విధంగా ప్రభుత్వ పరిపాలన ఉంది అన్నారు. కేసీఆర్ పొలం బాట పేరుతో రైతులను మభ్య పెట్టే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్, కెసిఆర్ పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకపోగా, కనీసం పరామర్శకూడా చేయలేదు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి ఫోన్ టాపింగ్, లిక్కర్స్ స్కామ్, ఉద్యోగాలను వేధింపులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, అభద్రత భావంతో బ్రతికే విధంగా పాలన చేశారు అని విమర్శించారు. పదేళ్ల పాలనలో వందేళ్ళ వెనక్కి రాష్ట్రాన్ని నెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గడ్డం వినోద్,వివేక్, ప్రేమ్ సాగర్ రావు,ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ తదితరులు పాల్గొన్నారు.

