పండగపూట ప్రమాదంలో కార్మికుడు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సింగరేణి కార్మికుడు లక్ష్మీనారాయణ..
అగ్నిధార న్యూస్ గోదావరిఖని టౌన్ విశ్వాసనీయ సమాచారం ప్రకారం పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీ ఓ సి పి త్రీ లో సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వర్తిస్తున్న ప్రగతి షావల్ నడుపుతున్న సమయంలో ఒక్కసారిగా బోల్తా పడినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనలో సింగరేణి కార్మికునికి బలమైన దెబ్బలు తలిగినట్లు తెలుస్తుంది. బలమైన గాయాలు కావడం చేత హుటాహుటిన సింగరేణి అధికారులు రెస్క్యూ టీం సహకారంతో సహాయ చర్యలు చేపట్టి, గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్ లోకి తరలించారు… అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించినట్లు తెలిసింది. పండుగ పూట ప్రమాదంతో కార్మికుని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..