ఆశావాహుల్లో నిరాశ.
కొందరికి మోదం కొందరికి ఖేదం.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసినా స్థానిక సంస్థల ఎన్నికలకు నగర మోగింది. కోడు కూసింది రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఎందరో ఆశావాహులకు కొందరికి మోదం మరి కొందరికి ఖేదం మిగిల్చింది. పెద్దపల్లి జిల్లాలో సోమవారం ప్రకటించిన ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచ్ ల రిజర్వేషన్ జాబితా రిజర్వేషన్ కొందరిలో ఆశలు రేపుతూ ఉంటే మరికొందరిలో నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా కొంత మంది యువకులతో పాటు ఆయ పార్టీల నాయకులు పోటీదారులు, ఎప్పటినుండో గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. గ్రామంలో ఎప్పుడు పెళ్లిళ్లు పేరంటాలతో , పరామర్శలకు ముందు ఉంటూ గ్రామ ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకున్నారు. సోమవారం ప్రకటించిన రిజర్వేషన్ తమకు అనుకూలంగా లేకపోవడం వల్ల కొందరు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయింది. కొంతమంది తమ సన్నిహితుల వద్ద కంటతడి పెట్టుకున్నారు.ఇది ఒక ఏ గ్రామానికి మండలానికి పరిమితం కాలేదు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ రిజర్వేషన్లతో పాటు ఎంపీటీసీ జెడ్పిటిసి స్థాయి రిజర్వేషన్ల వరకు పోటీ చేయాలనుకున్న ఆశావాహులకు కరెంట్ షాక్ ఇచ్చినట్లు అయింది.
లీకు వీరులెవరు…?
సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన రిజర్వేషన్లు..
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రిజర్వేషన్ల ప్రక్రియ అన్ని జిల్లాలలో సోమవారం ప్రకటించారు. పెద్దపల్లి జిల్లాలో కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసిల, రిజర్వేషన్ల ప్రక్రియ సోమవారం ప్రకటించినప్పటికీ, మూడు రోజులు ముందే అంటే శనివారం జిల్లాలోని జడ్పిటిసిల ఎంపీటీసీ, సర్పంచుల, రిజర్వేషన్ లఖరారు అనధికారిక జాబితా సోషల్ మీడియాలలో చెక్కర్లు కొట్టాయి. అవి చూసిన ఆశవాహుల్లో కొందరిలో ఆశలు చెలరేగాయి. మరికొందరిలో నిరాశలు కమ్ముకున్నాయి. అయినా ఆశవాకులు నిరాశ పడకుండా అవి అధికారికంగా ధ్రువీకరించినవి కాదని తమకు తాము సర్ది చెప్పుకున్నారు. అధికారిక రిజర్వేషన్ల కోసం ఎదురు చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష విడుదల చేసిన రిజర్వేషన్లను చూసి ఒక్కసారిగా చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. మూడు రోజుల కింద సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన అనధికారిక రిజర్వేషన్లు సోమవారం విడుదల చేసిన అధికారిక రిజర్వేషన్లు సరిపోల్చినప్పుడు ఏమాత్రం తీసిపోలేదు. అంటే రిజర్వేషన్ల పేపర్ శనివారమే లీక్ అయింది అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై గందర గోళం నెలకొన్న దృశ్య కొంత గోప్యంగా ఉంచవలసిన రిజర్వేషన్ ప్రక్రియను మండల స్థాయిలో…? జిల్లా స్థాయిలో…? ఎవరు లీక్ చేశారనేది,లీక్ వీరులు ఎవరు..? అనేది, ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. లేదు లేదు 2011 జనాభా లెక్కల ప్రకారం కామన్ మ్యాన్ ఎవరైనా రిజర్వేషన్ల ప్రక్రియను తయారుచేసి సోషల్ మీడియాలో పెట్టారు. అంటారేమో అధికారులు. చూడాలి మరి…!