స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
అగ్నిధారన్యూస్ హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు ఎన్నికల కమిషన్ తెరతీసింది.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొత్తం మూడు దశల్లో ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్టేట్ ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్, అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ ఉంటుంది. తెలిపింది. బీసీ రిజర్వేషన్ పై ఇప్పటికీ ఉత్కంఠత కొనసాగుతుంది. హైకోర్టులో ఇదే అంశం విచారణలో ఉంది. అక్టోబర్ 8న హైకోర్టులో చర్చ జరగబోతుంది. కాబట్టి మరుసటి రోజు ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల కానుంది.
షెడ్యూల్ ఇదే..✍️✍️✍️👇
• రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.
• అక్టోబర్ 9, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.
• మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు..
• అక్టోబర్ 17, 21, 25 తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
• అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల పోలింగ్,
• అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలు,
• అక్టోబర్ 31న, నవంబర్ 4, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.
• నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్.
• పోలింగ్ రోజునే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.