అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్

మా భూమిలో పంటను ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు పిర్యాదు చేస్తే మాపైననే అక్రమ కేసు పెట్టారని మాకు న్యాయం చేయాలని కమాన్ పూర్ మండలం పెంచికల్ పేటకు చెందిన కొలిపాక లీల, పర్వతాలు దంపతులు వేడుకున్నారు. ఈ మేరకు పెద్దపల్లి కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పిర్యాదు చేసినట్లు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 2 ఎకరాల పంటకు ఇరుగురాల శేఖర్ అనే వ్యక్తి గడ్డిమందు స్ప్రే చేసి నాశనం చేశారని ఆరోపించారు. మమ్మల్ని బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని వినతిపత్రం కోరినట్లు తెలిపారు.