పోచబోయిన శ్రీహరి యాదవ్.
అగ్నిధార న్యూస్ సిద్దిపేట
శుక్రవారం శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్లో జరిగిన యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో యాదవ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన అనంతరం అతిథులు మాట్లాడుతూ… అక్షరమాలతో విజ్ఞానం పంచే ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు మురళీకృష్ణ అన్నారు. సమాజంలో ఉత్తమ గురువులు ఉన్నప్పుడే సకల రంగాలు అభివృద్ధి జరుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా సి.ఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలువని విషయం తెలుపుతూ మార్గం చూపేది గురువులని, కష్ణజీవుల సమాజ మార్ఢదర్శకులు గురువులన్నారు. గొర్రెకాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ… యాదవ జాతి బిడ్డలుగా అక్షరాలతో వెలుగుపంచుతున్న ఉపాధ్యాయుల సేవలు మరువలేనివన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు స్ధానం గొప్పదని, జగత్ గురువు శ్రీ కృష్ణుని వారసులమని, నైతికత సామాజిక బాధ్యతతో కూడిన విద్యను అందించాలని, యాదవ సమాజ శ్రేయస్సుకు ఉపాధ్యాయులు పాటుపడాలన్నారు. అఖిల భారత యాదవ మహసభ జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు సమాజాన్ని తీసుకు వెళ్ళేది గురువులన్నారు. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఉపాధ్యాయులు పోలీసు లక్ష్మయ్య, బైరు సత్తయ్య, గెల్లు దశరథం, బొద్దుల బాల్ నర్సయ్య, బత్తిరాజు శంకర్, చింతకాయల శ్రీహరి, అక్కెం ఐలయ్య, పంజా రాజ మల్లు, బత్తుల రాములు, కొరివి మల్లేశం, పోలీస్ యాదగిరి, పోర్ల మల్లయ్య, సిల్ల రమేష్, బోనాల రాజేందర్, గుండెల్లి సత్యలక్ష్మి, జీల మల్లేశం, సందేబోయిన రాజు, నూనే యాదగిరి, తలారి చంద్రశేఖర్ యాదవ్ లను సత్కరించారు. సొసైటి అధ్యక్షులు బైరి అనీల్ కుమార్, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, పయ్యావుల ఎల్లం యాదవ్, బైరి రాములు యాదవ్, గొర్రె మల్లికార్జున్, బాగు యాదగిరి, చింతల బాల్ నర్సయ్య, జక్కుల రాజేశం, కాల్వ రాజయ్య, బైరి రమేష్, కుంచం శ్రీనివాస్, ఉండ్రాళ్ళ తిరుపతి, దారబోయిన రాజు, కట్ట బిక్షపతి, బాగు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.