ఎన్ఎస్ఎస్ ఆశయాలని కొనసాగించాలి.
సమాజ సేవకే ఎన్ఎస్ఎస్ ఆవిర్భావం.
ఎన్ఎస్ఎస్ ఆవిర్భావానికి 56 సంవత్సరాలు.
37 విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమైన 1047 కొనసాగింపు.
అగ్నిధారన్యూస్ కరీంనగర్
స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎ.నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా 56వ ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్-ఎ.నిర్మల కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… విద్యార్థి దశ నుండే ప్రతి విద్యార్థి సమాజానికి సేవ చేయాలని సేవాభావం పెంపొందించు కోవాలని అన్నారు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, మంచి నడవడిక, క్రమశిక్షణతో కూడిన విలువలు అలవడుతాయని తెలిపారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి.వెంకటరాజిరెడ్డి -జాతీయ సేవా పథకం-ఎన్ఎస్ఎస్ గురించి వివరించారు. 1969 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన జాతిపిత మహాత్మాగాంధీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి పద్మవిభూషణ్ విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజారావు ఏర్పాటు చేసారని, మొదట భారతదేశంలోని 37 విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమైన ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు ప్రస్తుతం 1047 విశ్వవిద్యాలయాలకు విస్తరించి, 20 లక్షల వాలంటీర్ల తో దేశంకోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఎన్ఎస్ఎస్-నినాదం “NOT ME BUT YOU” ( నేను నాకోసం కాదు మీకోసం) అని వివరించారు అన్నారు.”ఈ సందర్భంగా విద్యార్థుల చేత ఎన్ఎస్ఎస్ ప్రతిజ్ఞ చేయించి, వారికి మార్గనిర్దేశం చేశారు.విద్యార్థులు చదువుతోపాటు సంఘసేవ అలవర్చుకోవాలని, దీనివల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, తద్వారా దేశ సేవలో భాగస్వాములు కావాలని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్రతి విద్యార్థి సామాజిక స్పృహ కలిగి అంటరాని తనం, అస్పృశ్యత, బాల్యవివాహాలు వంటి సామాజిక రుగ్మతలను అరికట్టడానికి సమసమాజ నిర్మాణ స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.