అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
మహిళల రక్షణ చట్టాల పై అవగాహన కల్పించాలి::సినియర్ సివిల్ జడ్జి డి.వరూధినిమహిళా హెల్ప్ లైన్ 181 పట్ల విస్తృత ప్రచారం కల్పించాలి
• *445 కేసుల పరిష్కారం*
• *మహిళలను వేదిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు*
• *సఖీ కేంద్రాన్ని సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి*
పెద్దపల్లి అక్టొబర్ 26:-. మహిళల పై జరిగే హింస నివారణ చట్టాలపై అవగాహన కల్పించాలని చట్టాల పై అవగాహన కల్పించాలని , దీని కోసం అవసరమైన అన్ని చర్యలు పకడ్భందిగా చేపట్టాలని సీనియర్ సివిల్ జడ్జి డి.వరూధిని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లిలో సఖి కేంద్రాన్ని సందర్శించారు. *ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు నాల్సా (జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ) ఆదేశాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు* పేద వర్గాలకు న్యాయం అందించే దిశగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 39 ఏ సవరణ చేపట్టారని, అనంతరం జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ చట్టాన్ని రూపొందించారని తెలిపారు. ఈ చట్టం ప్రకారం పేద బడుగు బలహీనవర్గాల కు సైతం ఆర్థిక స్థితిగతుల తో సంబంధం లేకుండా న్యాయం అందేలా కృషి చేస్తుందని తెలిపారు. *వరకట్న వేధింపులు, గృహహింస, లైంగిక హింస, ఆడపిల్లల రవాణా, పనిచేసే చొట వేదింపులు మొదలైన సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణ, కౌన్సీలింగ్, న్యాయ సలహలను అందించేందుకు సఖీ కేంద్రాలను నిర్వహిస్తున్న సేవలను అభినందించారు* జిల్లాలో ఇప్పటి వరకు 10 సైబర్ నేరాలు, 5 వరకట్న వేదింపుల కేసులు,422 గృహహింస కేసులు, 3 మెంటల్ స్ట్రెస్ కేసులు, 26 మిస్సింగ్ కేసులు, 5 సెక్సుల్ వేదింపుల కేసులు, 5 పోస్కో కేసులు, 6 బాల్య వివాహ కేసులు, 45 ఇతర కేసులు మొత్తం 527 కేసులు నమోదు అయ్యాయని, వాటిలో ఇప్పటి వరకు 445 కేసులను పరిష్కరించామని అధికారులు వివరించారు. మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 181,1098 చైల్డ్ హెల్ప్ లైన్ పట్ల అవగాహన కల్పించాలని, దీని పై సామాజీక మాధ్యమాలో విస్తృత ప్రచారం కల్పించాలని మరియు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మహిళలు తిరిగే ప్రదేశాలలో ఫ్లెక్సీలు, బ్యానర్ లు,తదితర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించాలని,ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ మరియు సైబర్ నేరాల పరిస్థితుల దృష్ట్యా సఖి సెంటర్ కి ఒక వెబ్ సైట్ ని రూపొందించాలని సూచించారు.
జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.
