అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా :
నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టిపిసిసి ఉపాధ్యక్షులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు అనేకమంది ప్రజలు అలుపెరుగని పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక నాటి యూపీఏ చైర్ పర్సన్ తెలంగాణ తల్లి సోనియా గాంధీ, చలువతో ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాల్ని స్మరించుకునే ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని శనివారం రోజు ఎమ్మెల్యే ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని ఈ సందర్భంగా స్మరించుకోవడం గొప్ప విషయం అన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు, సకల జనులకు, ప్రత్యేక రాష్ట్ర అకాంక్షను గౌరవించి మద్ధతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ, తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా గాంధీకి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని ప్రజలు గుర్తించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారని గుర్తు చేశారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ద్యేయంగా సీయం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని అన్నారు. అగ్నిధార నవలలో దాశరథి కృష్ణమాచార్యులు చెప్పిన విధంగా,నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల ఆశయ సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందుతున్నదని తెలిపారు.
యావత్ తెలంగాణ సమాజం యొక్క మనోభావాలకు అనుగుణంగా, ప్రజా సంఘాలు, పౌర సంస్థలు, ఉద్యోగ సంఘాలతో సంప్రదిస్తూ… వారి అభిప్రాయాలను గౌరవిస్తూ… ప్రజాస్వామిక పాలనను అందిస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించిందని పునరుద్ఘాటించారు.
