ఈనెల 21న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం.
రాష్ట్ర కమిటీ ఏర్పాటు.
ఉత్సాహవంతులైన ప్రతి ఒక్కరు పాల్గొనాలి.
వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ పిలుపు.
అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ )
మాదిగ శక్తి ఆధ్వర్యంలో నిర్వహించే,కార్యక్రమానికి రావాల్సిందిగా మోత్కుపల్లి నర్సింహులు, ప్రోఫెసర్ కాశీమ్ లను మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్ని మాదిగ మంగళవారం రోజు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సురేందర్ సన్నీ మాట్లాడుతూ…..ఈ నెల 21 శుక్రవారం రోజున మాదిగ శక్తి ఆద్వర్యంలో హైదరాబాద్ లోనీ సోమాజి గూడ ప్రెస్ క్లబ్ నందు నిర్వహిస్తున్న మాదిగ శక్తి సుస్తిర లక్ష్యాల బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును ఆహ్వానించడానికి ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకముగా కలసి పూల గుచ్చం అందించి, ప్రొఫెసర్ కాశీమ్ ని ఉస్మానియ యూనివర్శిటీ లో కలసి, ఈ నెల 21న హైదరబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నాం 1గంటల వరకు నిర్వచించే సుస్థిర లక్ష్యాల బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రావలసిందిగా ఇరువురిని ఆహ్వానించానని తెలిపారు. అదే రోజు రాష్ట్ర కమిటీ ఏర్పాటు ఉంటుంది అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు, జాతి నిర్మాణానికి పనిచేయాలనుకునే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉత్సాహవంతులైన,యువతీ యువకులు, కార్మిక కర్షకలు, కవులు కళాకారులు మేదావులు వివిధ మాదిగ సంఘాల నాయకులు హాజరై మాదిగ శక్తి నిర్మాణంలో భాగస్వాములు అయి రాజ్యాధికారంతోపాటు,అన్ని రంగాలలో మాదిగల వాటా కోసం రాజ్యాంగ బద్ధంగా నిర్వచించే కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్ని పత్రిక ప్రకటనలో కోరారు.

