అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్ కు చెందిన 8వ తరగతికి చెందిన కాసర్ల సాక్షిత్ నేషనల్ మెయిన్స్ కం మెరిట్ అవార్డు స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు మోడల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు 48 వేల రూపాయలు స్కాలర్షిప్ రూపంలో వస్తాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు, వివిధ రంగాలలో ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు తో పాటు పలువురు అభినందనలు తెలియజేశారు.
