అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల చివరి సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీపీ బాలాజీ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాలకవర్గ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పాల్గొని పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేవిజయరమణరావుమాట్లాడుతూ..తమ పదవీకాలం ముగిసిందని నాయకులు స్తబ్దతలో ఉండవద్దని, ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రతి అధికారితో సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని త్వరలోనే తీర్చనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ సమస్య ఉందనిరెండు రోజుల క్రితం పెద్దపెల్లి నియోజకవర్గం లో సమావేశం నిర్వహించి వాటికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, జెడ్పిటిసి,ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి , వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆఫ్
