అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో
రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అదేశాల మేరకు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారెడ్డి ఎస్సైలుశ్రావణ్ కుమార్, నరేష్ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వాహనంలో తరలిస్తున్న డబ్బులను, శ్రీకాకుళానికి చెందిన ధనుంజయ్, గోదావరిఖని పట్టణానికి చెందిన ములకల రాజకుమార్, చిన్నపల్లి అవినాష్ పట్టుకొని ప్రశ్నించగా వారి వద్ద అధిక మొత్తంలో డబ్బులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకోవడంతోపాటు అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులో 33 లక్షల పదివేల రూపాయలు పట్టుబడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ ముగ్గురు యువకులు గోదావరిఖనిలో లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అయినా 55 క్లబ్ , తిరంగా యాప్,82 లాటరీ అప్ ల ద్వారా బెట్టింగ్ పెడుతూ, ఆ యాప్ లను సోషల్ మీడియా ఆయన ఇంస్టాగ్రామ్ టెలిగ్రామ్ యాప్ ల ద్వారా ఫాలోవర్స్ కి బెట్టింగ్ యాప్స్ లింక్స్ పంపుతూ వాడిని ఆడేలా ప్రోత్సహిస్తూ ఆ యాప్ ని ప్రజలు ఆడేలా ప్రత్యక్షంగా వాటిని ప్రమోట్ చేస్తూ వాటి ద్వారా ఆ డబ్బులు సంపాదిస్తున్నామని వారు తెలిపారు. అందులో భాగంగా బెట్టింగ్ యాప్ లో జమాయిన డబ్బును యూఎస్ డి టి ద్వారా బెట్టింగ్ యాప్ హైదరాబాదులో ఉన్న ఈ యాప్ల ద్వారా వచ్చే డబ్బును మార్చి గుర్తు తెలియని మనీ ట్రేడర్స్ ద్వారా ఆ డబ్బుని తీసుకొని హైదరాబాదు నుండి గోదావరిఖనికి వస్తుండగా మార్గమధ్యంలో పోలీసులు తనిఖీ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.ఇలాంటి యాప్ ల ద్వారా డబ్బులు పోగొట్టకుండా అప్రమత్తంగా ఉండాలని సుల్తానాబాద్ పోలీసులు ప్రజలను కోరారు.
