మంథని డివిజనల్ పంచాయతీ అధికారిని సరెండర్ చేసిన జిల్లా కలెక్టర్
————————–
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
————————–
పెద్దపల్లి జిల్లా మంథని డివిజనల్ పంచాయతీ అధికారి ఎ.శంకర్ ను కమీషనర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, హైదరాబాద్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు.
మంథని డివిజనల్ పంచాయతీ అధికారి ఎ.శంకర్ సేవలు సంతృప్తికరంగా లేవని భావించిన కలెక్టర్ ఆయనను సరెండర్ చేసి పెద్దపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి వి. వేణు గోపాల్ కు మంథని డివిజనల్ పంచాయతీ అధికారి పోస్టుకు ఇన్చార్జిగా నియమించారు.
